నాచగిరి క్షేత్రంలో కార్తీక సందడి
ABN , First Publish Date - 2020-11-27T05:39:20+05:30 IST
రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది.

వర్గల్, నవంబరు 26: రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా గురువారం ఆలయ మండపంలో సామూహిక సత్యనారయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచారించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ కట్ట సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయంలోని శివాలయం వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.