పాత్రికేయులంటే గౌరవం ఉంది
ABN , First Publish Date - 2020-12-18T05:17:18+05:30 IST
చట్టాన్ని గౌరవించే క్రమశిక్షణతో పాటు పాత్రికేయులంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, డిసెంబరు 17: చట్టాన్ని గౌరవించే క్రమశిక్షణతో పాటు పాత్రికేయులంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఒక పాత్రికేయుడితో తలెత్తిన వివాదం దురదృష్టకరమన్నారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో పాత్రికేయులతో ఎంతో సఖ్యంగా ఉన్నానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే అంశంలో వారు అందించిన సహాయం మరువలేనిదన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానన్నారు. అందుకే రెండు మార్లు పటాన్‌చెరు నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారన్నారు. తనపై పటాన్‌చెరు పోలీసులు అత్యుత్సాహంతో కేసు నమోదు చేశారన్నారు. కేసుపై పోలీసులు ఇచ్చిన నోటీసును స్వయంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తీసుకున్నానన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మెట్టుకుమార్‌యాదవ్, పుష్పనగేష్‌కురుమ, మున్సిపల్ చైర్మన్ తుమ్మలపాండురంగారెడ్డి, జడ్పీటీసీలు సుప్రజవెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ ఈతసుష్మశ్రీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాలనీల్లో మౌలిక వసతులకు పెద్దపీట
కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి, జయలక్ష్మీకాలనీ, గ్రీన్‌ఫీల్డ్స్ తదితర కాలనీల్లో రూ.95లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టే సీసీ రోడ్లకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు లావణ్యశశిధర్‌రెడ్డి, మున్నా, గోపి తదితరులు పాల్గొన్నారు.