దేదీప్యమానం...లక్షదీపోత్సవం

ABN , First Publish Date - 2020-03-16T07:52:14+05:30 IST

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలోని శ్రీ సప్తప్రాకారయుత దుర్గాభవానీ మహాక్షేత్ర ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం దుర్గా భవానీమాత రాజరాజేశ్వరి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

దేదీప్యమానం...లక్షదీపోత్సవం

రాజరాజేశ్వరీదేవిగా ఆమ్మవారు

భారీగా తరలి వచ్చిన భక్తజనం

కిటకిటలాడిన ఆలయ పరిసరాలు


సంగారెడ్డి రూరల్‌, మార్చి 15: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలోని శ్రీ సప్తప్రాకారయుత దుర్గాభవానీ మహాక్షేత్ర ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం దుర్గా భవానీమాత రాజరాజేశ్వరి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మాధికారి రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు రవికుమార్‌శర్మ, దాత్తాత్రేయ శర్మలు ఉదయం 4గంటల నుంచి అమ్మవారిని నూతన వస్త్రాలు, పూలహారాలు, నిమ్మకాయల దండలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి భక్తులు మంగళ హారతులు కుంకుమార్చనలు, పూర్ణాహుతి, మహా యాగాలు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష దీపోత్సవం సందర్భంగా ఆయల ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. లక్షదీపోత్సవ కాంతులతో ఆలయం ప్రాంగణం వెలుగుతో కళకళలాడింది.


  ఆలయం ఆవరణలో స్వీటు దుకాణాలు, చిన్న పిల్లల ఆట వస్తువుల, బొమ్మలు, మహిళల ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు. వారోత్సవాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టెంట్‌, మంచి నీటి సౌకర్యాలతో పాటు అన్ని రకాల ఏర్పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచే కాకుండా హైదరాబాద్‌, జహీరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్‌, నారాయణఖేడ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాత ప్రసాద వితరణ అందజేశారు. 

Updated Date - 2020-03-16T07:52:14+05:30 IST