మల్లన్న కల్యాణానికి మంత్రులకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-30T05:34:36+05:30 IST
జనవరి 10న సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరిగే మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ అధికారులుమంగళవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
చేర్యాల, డిసెంబరు 29: జనవరి 10న సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో జరిగే మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆలయ అధికారులుమంగళవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఆహ్వాన పత్రాలను అందజేసిన వారిలో ఈవో బాలాజీ, ఏఈవో గంగా శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, ఆకుల విజయ్‌కుమార్ ఉన్నారు.