అంతర్రాష్ట్ర సరిహద్దులు బంద్
ABN , First Publish Date - 2020-03-24T06:38:13+05:30 IST
కరోనా వైర్‌సను నియంత్రించేందుకు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కంగ్టి మండలంలోని దెగుల్‌వాడీ వద్ద రాష్ట్ర పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో, కంగ్టి పోలీసులు వాహనాల...

- కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
కంగ్టి, మార్చి 23 : కరోనా వైర్‌సను నియంత్రించేందుకు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కంగ్టి మండలంలోని దెగుల్‌వాడీ వద్ద రాష్ట్ర పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో, కంగ్టి పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం సైతం లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో ఆ రాష్ట్ర సరిహద్దులోని నాగన్‌పల్లి వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఈ రెండు చెక్‌పోస్టుల వద్ద వీరితోపాటు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వచ్చిపోయే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరీక్షించి వదులుతున్నారు. కంగ్టి ప్రజలకు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలతోనే అత్యధికంగా బంధుత్వాలు, వ్యాపార లావాదేవీలు ఉండడంతో అధికారులు ఈ మేరకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.