అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-07-05T11:35:40+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ములుగు ఆర్‌ఐ అపర్ణ, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ మండలంలోని దాసర్లపల్లిలో పట్టుకున్నారు

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ములుగు, జూలై 4 : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ములుగు ఆర్‌ఐ అపర్ణ, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌ మండలంలోని దాసర్లపల్లిలో పట్టుకున్నారు. గ్రామానికి చెందిన భూక్య భిక్షపతిని అదుపులోకి తీసుకొని 65 క్వింటాళ్ల బియ్యాన్ని, డీసీఎం, జిట్టో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా రేషన్‌ బియ్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-05T11:35:40+05:30 IST