దుద్దెడలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-03-24T06:47:05+05:30 IST

మండలంలోని దుద్దెడలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు కుకునూరుపల్లి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌...

దుద్దెడలో పెద్ద మొత్తంలో మద్యం స్వాధీనం

కొండపాక, మార్చి 23: మండలంలోని దుద్దెడలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు కుకునూరుపల్లి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ట్రైనీ ఐపీఎస్‌ అఖిల్‌ మహాజన్‌ ఆధ్వర్యంలో దుద్దెడలోని బీసీ కాలనీలో నాలుగు ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి సుమారు రూ.2లక్షలకు పైగా విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read more