అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కేసులే

ABN , First Publish Date - 2020-03-25T12:52:21+05:30 IST

నిత్యవసర సరుకులను అఽధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రవీందర్‌రావుహెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరోలతో మాట్లాడారు. నిత్యవసర సరుకులను వ్యాపారులు

అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కేసులే

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 24: నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ రవీందర్‌రావుహెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరోలతో మాట్లాడారు. నిత్యవసర సరుకులను వ్యాపారులు నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు. అధిక ధరలకు విక్రయించినా, నాణ్యత లేని వస్తువులు అంటగట్టినా కేసులు నమోదు చేసి, జరిమానా విఽధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. 

Updated Date - 2020-03-25T12:52:21+05:30 IST