సీనియర్ సిటిజన్స్‌కు హెల్ప్‌లైన్
ABN , First Publish Date - 2020-04-05T10:21:05+05:30 IST
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ
మెదక్ రూరల్, ఏప్రిల్ 4: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్‌బీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ దృష్ట్యా 18005278980, 14567 నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తుందని, వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.