జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-14T11:22:47+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జిల్లాలో భారీ వర్షం

మెదక్‌ మండలం రాజ్‌పల్లిలో 148.5 మి.మీ నమోదు


మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 13 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకేరోజు జిల్లా అంతటా భారీ వర్షం పడడంతో చెరువుల్లోకి వరద పెరిగింది. వర్షాకాలం మొదలైన తర్వాత జిల్లాలో ఇంత పెద్దఎత్తున వర్షం పడలేదు. జిల్లావ్యాప్తంగా 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రామాయంపేటలో అతి తక్కువగా 3.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాదాపు నెలరోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు వరుణుడి కరుణతో ఊరట కలిగింది.


జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లావ్యాప్తంగా రాత్రి భారీవర్షం కురిసింది. జిల్లాలో 28.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మెదక్‌లో 74 మి.మీ., టేక్మాల్‌లో 56.1 మి.మీ., హవేళీఘణపూర్‌లో 47.1 మి.మీ., చిల్‌పచెడ్‌ 41.6 మి.మీ., పెద్దశంకరంపేట 41.1 మి.మీ., కౌడిపల్లి 40.5 మి.మీ., పాపన్నపేట 40.4 మి.మీ., కొల్చారం 40.3 మి.మీ., అల్లాదుర్గం 28.5 మి.మీ., నర్సాపూర్‌ 26.1 మి.మీ., శివ్వంపేట 25.5 మి.మీ., వెల్దుర్తి 22.5 మి.మీ., వెల్దుర్తి 22.5 మి.మీ., రేగోడ్‌ 21.6 మి.మీ., తూప్రాన్‌ 20 మి.మీ., మనోహరాబాద్‌ 14 మి.మీ., చేగుంట 8.2 మి.మీ., చిన్నశంకరంపేట 8.1 మి.మీ., నార్సింగి 4 మి.మీ., రామాయంపేట 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2020-09-14T11:22:47+05:30 IST