జిల్లాలో పలుచోట్ల జోరువాన

ABN , First Publish Date - 2020-03-12T08:12:08+05:30 IST

సిద్దిపేట జిల్లాలో బుధవారం రాత్రి పలుచోట్ల జోరువాన కురిసింది. గజ్వేల్‌, హుస్నాబాద్‌, అకన్నపేటలో దాదాపు 40 నిమిషాల పాటు వర్షం

జిల్లాలో పలుచోట్ల జోరువాన

హుస్నాబాద్‌, మార్చి11: సిద్దిపేట జిల్లాలో బుధవారం రాత్రి పలుచోట్ల జోరువాన కురిసింది. గజ్వేల్‌, హుస్నాబాద్‌, అకన్నపేటలో దాదాపు  40 నిమిషాల పాటు వర్షం కురిసింది. హుస్నాబాద్‌లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. హన్మకొండ రోడ్డు వరద నీటితో నిండింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేర్యాల మండలం పెద్దరాజుపేటలో పిడుగుపాటుకు బొల్లెమల్లయ్యకు చెందిన కాడెద్దు, అక్కన్నపేట మం డలం కుందనవానిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చౌటకుంటలో పిడుగు పాటుకు మాలోతు దేవేందర్‌కు చెందిన పాడిపశువు మృతిచెందింది. 

Updated Date - 2020-03-12T08:12:08+05:30 IST