కాళేశ్వరం నీళ్లతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలు
ABN , First Publish Date - 2020-11-21T05:52:54+05:30 IST
కాళేశ్వరం నీళ్లతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలు

గ్రామాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
గజ్వేల్, నవంబరు 20 : సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం నీళ్లతో వచ్చే ఏడాది నుంచి రెండు పంటలు పండుతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ మండలం పరిధిలోని దిలాల్‌పూర్‌లో శుక్రవారం రూ.21.50 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా భవనం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.కోటి 19లక్షల వ్యయంతో నిర్మించిన సామూహిక ఫంక్షన్‌హాల్‌ను ఆయన ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం గజ్వేల్‌కు వెళ్లేవారని, ప్రస్తుతం గ్రామంలో అన్ని రకాల ఫంక్షన్లు, పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. గ్రామాలాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆరేళ్లలో రూ.17కోట్లతో దిలాల్‌పూర్ గ్రామాభివృద్ధి చేశామని పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, అండగా నిలిచేందుకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌ల ద్వారా వచ్చే ఏడాది నుంచి రైతన్నలు రెండు పంటలు పండించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, 24గంటల ఉచిత విద్యుత్ రైతాంగానికి ఇస్తున్నామని చెప్పారు. వారివెంట ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు మాదాసు శ్రీనివాస్, బెండే మధు, సర్పంచ్ దివ్యసుధామా, దయాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, చిన్నమల్లయ్య, వెంకట్‌నర్సింహ్మారెడ్డి, ఎంపీటీసీ గంగాధర్ ఉన్నారు.