గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-03-25T13:13:13+05:30 IST
నారాయణఖేడ్ సాంీఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మధుసూదన్‌ను సస్పెన్షన్ చేస్తూ గురుకుల పాఠశాల సెక్రెటరీ ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 15 నెలలుగా ఇక్కడ విధులు

నారాయణఖేడ్, మార్చి 24 : నారాయణఖేడ్ సాంీఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మధుసూదన్‌ను సస్పెన్షన్ చేస్తూ గురుకుల పాఠశాల సెక్రెటరీ ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 15 నెలలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఆయనపై సెంట్రల్ విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న క్రమంలో జూనియర్ లెక్చరర్ సాయిరెడ్డిపై దాడికి దిగడం సంచలనమైంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. ఈ విషయమై వివరాలు సేకరించిన గురుకుల పాఠశాలల సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్ మధుసూదన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఖేడ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న బండి సూర్యారావును ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ అదే ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన మధుసూదన్‌రావును తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హెడ్‌క్వార్టర్‌లోనే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.