రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మార్పీఎస్
ABN , First Publish Date - 2020-10-19T09:41:46+05:30 IST
అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు గంధగల్ల ప్రసాద్ అన్నారు

హత్నూర, అక్టోబరు 18 : అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు గంధగల్ల ప్రసాద్ అన్నారు. మండలంలోని కొన్యాల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. పత్తి, వరి పంటలు చేతికి వచ్చే దశలో పూర్తిగా పాడైపోయాయని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేయాలని కోరారు. ఆయన వెంట ఏర్పుల రాజు, త్యాగరాజు, చిన్న సాయిలు, కిష్టయ్య, దామోదర్ ఉన్నారు.