కుటీర పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , First Publish Date - 2020-12-27T05:34:09+05:30 IST
గ్రామీణ కుటీర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పేర్కొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్
హుస్నాబాద్‌రూరల్, డిసెంబరు 26 : గ్రామీణ కుటీర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్ మండలం పోతారం( ఎస్) గ్రామంలో శ్రీ వేద నాన్ ఓవెన్ సంచుల పరిశ్రమను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం పూర్తిగా తగ్గించాలని కోరారు. సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో గ్రామీణ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోతారం (ఎస్) మహిళా సమాఖ్య నాయకురాలు కనకతారను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసార్ల అశోక్‌బాబు, వంగ వెంకట్రామిరెడ్డి,మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, బాలునాయక్, సర్పంచ్ బత్తిని సాయన్న, కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్ప మండల పూజ
హుస్నాబాద్, డిసెంబరు 26 : హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వరగుట్టపై ఉన్న అయ్యప్ప ఆలయంలో శనివారం రాత్రి అయ్యప్ప మండల పూజ మహాత్సవం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్ అయ్యప్పస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్,కర్ర శ్రీహరి, వంగ వెంకట్రామ్‌రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, వెంకట్, పీ.భాగ్యరెడ్డి, వీవీ రమణ, వాల నవీన్‌రావు పాల్గొన్నారు.