నా వేతనంలో నుంచి గొర్రెల కాపర్ల సంక్షేమానికి ఇస్తా
ABN , First Publish Date - 2020-12-02T05:19:05+05:30 IST
దుబ్బాక, డిసెంబరు 1 : తనకు వచ్చే వేతనంలో నుంచి కొంత వరకు ప్రతీనెల గొర్రెల కాపర్ల సంక్షేమానికి వినియోగిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు.

ప్రతీ నెలా పశువైద్యాధికారులకు చెల్లింపు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, డిసెంబరు 1 : తనకు వచ్చే వేతనంలో నుంచి కొంత వరకు ప్రతీనెల గొర్రెల కాపర్ల సంక్షేమానికి వినియోగిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రకటించారు. వాటిని గొర్రెలకు వేసే టీకాలు, వివిధ వ్యాధుల నుంచి రక్షణకు వినియోగించేందుకు ఉపకరిస్తానని ఆయన చెప్పారు. మంగళవారం చిట్టాపూర్‌లో గొర్రెలకు నట్టల నివారణ టీకాలను ఆయన వేశారు. పశు వైద్యశాలల్లో మందులు లేవనే పదం వినపడవద్దని, పేదలను సిద్దిపేటలోని ప్రైవేటు మందుల దుకాణాల చుట్టూ తింపవద్దన్నారు. మందుల కొనుగోలుకు తన వేతనంలో నుంచి నెలనెలా కొంత చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చిట్టాపూర్ గ్రామంలోని పెద్దచెరువును పరిశీలించారు.