ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట మోసం

ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST

హుస్నాబాద్‌ పట్టణంలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం తూకంలో బస్తాకు తరుగు పేరిట మూడు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని రైతులు గురువారం అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట మోసం

హుస్నాబాద్‌, నవంబరు 26: హుస్నాబాద్‌ పట్టణంలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో సన్నరకం ధాన్యం తూకంలో బస్తాకు తరుగు పేరిట మూడు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని రైతులు గురువారం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆర్డీవోకు, ఎమ్మెల్యేకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. మొదటగా బస్తాకు సంచి బరువు పేరిట కిలో ఎక్కువ తూకం వేశారు. గురువారం నుంచి తరుగు పేరిట మరో రెండు కిలోలు తీసుకుంటున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన చేశారు. మిల్లర్లు తరుగు పేరిట బస్తాకు మూడు కిలోలు ఇస్తేనే ధాన్యాన్ని దించుకుంటున్నారని లేదంటే వాపస్‌ పంపిస్తున్నారని కొనుగోలు కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రైతుల ఆందోళనలతో కొనుగోళ్లను నిలిపివేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో రైతు ఐక్యతా సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్‌, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST