ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధం
ABN , First Publish Date - 2020-11-25T06:26:32+05:30 IST
ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధమైన సంఘటన బెజ్జంకి అనుబంధ గ్రామం ఎల్లంపల్లి శివారులో మంగళవారం జరిగింది.

బెజ్జంకి, నవంబరు 24: ప్రమాదవశాత్తు వరి ధాన్యం దగ్ధమైన సంఘటన బెజ్జంకి అనుబంధ గ్రామం ఎల్లంపల్లి శివారులో మంగళవారం జరిగింది. రైతు కుసుంభ శంకర్‌రావు ఆదివారం తన వ్యవసాయ భూమిలోని వరిపంటను హార్వెస్టర్‌తో కోసి మరుసటిరోజు ధాన్యం కుప్పను పొలం వద్ద నిల్వచేశాడు. మంగళవారం ఉదయం వెళ్లి చూసేసరికి వరిధాన్యం దగ్ధమై ఉందని రైతు రోదిస్తూ చెప్పాడు. సుమారు 20 క్వింటాళ్ళ వరిధాన్యం దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకునేలా అధికారులు సహకరించాలని బాధిత రైతు కోరాడు.