తూప్రాన్‌లో మాస్క్‌లు ధరించని వారి నుంచి రూ.29,500 జరిమానా వసూళ్లు

ABN , First Publish Date - 2020-05-09T09:57:27+05:30 IST

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో మాస్కులు ధరించని వ్యక్తులపై పోలీసు, మున్సిపల్‌ అధికారులు శుక్రవారం కొరడా ఝలిపించారు.

తూప్రాన్‌లో మాస్క్‌లు ధరించని వారి నుంచి రూ.29,500 జరిమానా వసూళ్లు

తూప్రాన్‌, మే 8: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో మాస్కులు ధరించని వ్యక్తులపై పోలీసు, మున్సిపల్‌ అధికారులు శుక్రవారం కొరడా ఝలిపించారు. ప్రభుత్వ నిబంధనలు అమలుల్లోకి వచ్చిన మొదటిరోజే రూ.29,500ల జరిమానాలు వసూలు చేశారు. తూప్రాన్‌ పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తాలో తూప్రాన్‌ ఎస్‌ఐ సుభాష్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ అధికారులు మాస్కులు ధరించకుండా సంచరిస్తున్నవారిపై జరిమానాలు విధించారు.


మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజుద్ధీన్‌ దుకాణాలను తనిఖీ చేశారు. మాస్కులు ధరించకుండా ఉన్న వ్యాపారులు, కొనుగోలుదారులు, శానిటైజర్లు లేకుండా వ్యాపారాలు చేస్తున్నవారిపై సైతం జరిమానాలు విధించారు. తూప్రాన్‌ పట్టణంలో శుక్రవారం రూ. 29,500ల జరిమానాలు వసూళ్లు చేశారు. జరిమానాలు చెల్లించని నలుగురి వాహనాలను జప్తు చేసినట్లు ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు.  

Updated Date - 2020-05-09T09:57:27+05:30 IST