విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-11-25T05:34:42+05:30 IST

పొలం వద్ద మీటరులో ఫీజ్‌ను పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

మిరుదొడ్డి/తొగుట, నవంబరు 24: పొలం వద్ద మీటరులో ఫీజ్‌ను పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మిరుదొడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య(62) సోమవారం సాయంత్రం తన పొలం వద్ద ఉన్న మీటరులో ఫీజ్‌ను పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతిచెందాడు. మంగళవారం మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


Read more