లాక్‌డౌన్ నుంచి మినహాయింపు వీటికే
ABN , First Publish Date - 2020-03-24T06:15:47+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నుంచి అత్యవసర సేవలుగా గుర్తించిన కొన్ని పరిశ్రమలకు మినహాయింపును ప్రకటించారు. పటాన్‌చెరు, పాషమైలారం పారిశ్రామిక వాడలోని...

పటాన్‌చెరు, మార్చి 23: ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నుంచి అత్యవసర సేవలుగా గుర్తించిన కొన్ని పరిశ్రమలకు మినహాయింపును ప్రకటించారు. పటాన్‌చెరు, పాషమైలారం పారిశ్రామిక వాడలోని కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనసాగుతున్నాయి. వాటిలో రైస్‌మిల్లులు, అన్ని రకాల ఆయిల్ మిల్స్, పప్పుమిల్లులు, పాల ఉత్పత్తుల డైరీ పరిశ్రమలు, ఆర్‌ఓ, డిస్టిలరీ వాటర్ ప్లాంట్లు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, పిండిమిల్లులు, ఆహార ఉత్పత్తులైన వర్మిసెల్లి, బ్రెడ్, బిస్కట్లు, ఫ్రూట్‌జ్యూస్, పల్ప్ పరిశ్రమలు, బల్క్‌డ్రగ్, ఐవీ సెట్లు, ఇతర మెడికల్ ఉపకరణాలు తయారు చేసే పరిశ్రమలు, సర్జికల్ సామగ్రి తయారీ, బ్యాండేజ్, ఆక్సీజన్ సిలిండర్ల తయారీ, మాస్క్‌లు, బాడీసూట్లు, అన్ని రకాల ఫార్మాసూటికల్ పరిశ్రమలు, సానిటైజర్లు, లిక్విడ్‌సబ్బులు, డిటర్జెంట్‌లు, ఫినాయిల్, ఫ్లోర్ శుభ్రం చేసే ఉత్పత్తుల పరిశ్రమలు, పేపర్‌నాప్కిన్, డైపర్లు, కోల్డ్‌స్టోరేజ్‌లకు మినహాయింపు ఇచ్చారు.
ఆగ్రోబే్‌సడ్ పరిశ్రమలైన మిరపకారం, పసుపు, ఉప్పు, మసాలాలు తయారు చేసే పరిశ్రమలు, బేకరీ ఉత్పత్తులు, ఐస్‌ప్లాంట్లు, చేపలు, పౌలీ్ట్ర, పశువుల దాణా పరిశ్రమలు, సోలీర్, విండ్ పవర్ జనరేషన్ పరిశ్రమలు, చక్కెర పరిశ్రమ, ఆయుర్వేదిక్, హోమియోపతి మందుల తయారీ యూనిట్లు, బ్లీచింగ్ పౌడర్, రసాయన శుద్ధి పరిశ్రమలు, విత్తన తయారీ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. జాబితాలో లేని ఇంజనీరింగ్, ప్లాస్టిక్, గార్మెంట్, పెస్టిసైడ్, ఫౌండ్రీ పరిశ్రమలను లాక్‌డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.