కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-11-27T05:36:22+05:30 IST

కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మించిన కలెక్టరేట్‌ భవన ప్రారంభానికి మూడు రోజుల్లోగా సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలి
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


కొండపాక, నవంబరు 26: కొండపాక మండలం దుద్దెడ శివారులో నిర్మించిన కలెక్టరేట్‌ భవన ప్రారంభానికి మూడు రోజుల్లోగా సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్‌  వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో మిగులు పనులను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులకు ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. 29లోగా శాఖల వారీగా ఫర్నీచర్‌ అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. ఆయనవెంట అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామిల్‌ఖాన్‌, గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రామేశ్వర్‌, ఆర్‌అండ్‌బీ శాఖ డీఈ వెంకటేశ్వర్లు ఉన్నారు. 


Read more