వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే

ABN , First Publish Date - 2020-02-12T09:52:51+05:30 IST

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.విఠల్‌ హెచ్చరించారు. సంగారెడ్డిలోని

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే

  • మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌
  • సంగారెడ్డిలో ఘనంగా మూడో రాష్ట్ర మహాసభ


సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 11 : వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.విఠల్‌ హెచ్చరించారు. సంగారెడ్డిలోని కెమిస్ట్‌ భవన్‌లో తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర మూడో మహాసభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాల్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎ్‌స.బోస్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. అంతకుముందు సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌ జెండాను ఆవిష్కరించారు. మహాసభ ప్రారంభోత్సవంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కే.సంగారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎండీ యూసుఫ్‌, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, యూనియన్‌ నాయకులు, వైద్య ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 


నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భీంరావ్‌ పాటిల్‌, కోశాధికారిగా సురేశ్‌ ఆనంద్‌, కార్య నిర్వాహక అధ్యక్షురాలిగా హేమలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భీంరావ్‌పాటిల్‌ మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని తెలిపారు.   

Updated Date - 2020-02-12T09:52:51+05:30 IST