పొంచి ఉన్న ‘విద్యుత్‌’ ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-28T05:02:22+05:30 IST

గుమ్మడిదల మండల కేంద్రంలోని రాయిని చెరువు సమీపంలో వార్డ్‌ మెంబర్‌ ఆకుల సత్యనారాయణ పొలం మీదుగా మిగితా రైతుల బోరు మోటార్లకు సరఫరా అయ్యే విద్యుత్‌ తీగ తెగి ఓ కడ్డీతోనే ఆగి ఉంది.

పొంచి ఉన్న ‘విద్యుత్‌’ ప్రమాదం
తెగడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్‌ తీగ

 పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు


గుమ్మడిదల, డిసెంబరు 27 : గుమ్మడిదల మండల కేంద్రంలోని రాయిని చెరువు సమీపంలో వార్డ్‌ మెంబర్‌ ఆకుల సత్యనారాయణ పొలం మీదుగా మిగితా రైతుల బోరు మోటార్లకు సరఫరా అయ్యే విద్యుత్‌  తీగ తెగి ఓ కడ్డీతోనే ఆగి ఉంది. ఏ క్షణమైనా ఆ తీగ తెగే ప్రమాదం ఉండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పొలంలో చేతికి అందే ఎత్తులో విద్యుత్‌ తీగలు ఉండడంతో రైతులు భయపడుతున్నారు. విద్యుత్‌ తీగను మరమ్మతు చేయండి అని రైతులు ట్రాన్స్‌కో అధికారులకు ఎన్ని మార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Updated Date - 2020-12-28T05:02:22+05:30 IST