సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-15T06:00:25+05:30 IST

జిల్లాలో వెనుకబడిన తరుగతుల శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలి జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న తల్లోజు ఆచారి

జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి


సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 14 : జిల్లాలో వెనుకబడిన తరుగతుల శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలి జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు ఎన్ని ఉన్నాయని, వాటి నిర్వహణ ఏ విధంగా ఉందని ఆరా తీశారు. ప్రభుత్వ వసతి గృహాల వివరాలు, బీసీలకు ఇప్పటివరకు కేటాయించిన రుణాల వివరాలను తనకు సమర్పించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి కేశరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:00:25+05:30 IST