వారంలో వెల్దుర్తి బాధితులకు ‘డబుల్‌’ ఇళ్లు

ABN , First Publish Date - 2020-12-20T05:47:54+05:30 IST

వారం రోజుల్లో వెల్దుర్తి ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు ఇల్లు కోల్పోయి నష్టపోయిన బాధితులందరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నట్లు నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు.

వారంలో వెల్దుర్తి బాధితులకు ‘డబుల్‌’ ఇళ్లు
వెల్దుర్తిలో స్థానికులతో మాట్లాడుతున్న మదన్‌ రెడ్డి


నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి


వెల్దుర్తి డిసెంబర్‌ 19: వారం రోజుల్లో వెల్దుర్తి ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు ఇల్లు కోల్పోయి నష్టపోయిన బాధితులందరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఇవ్వనున్నట్లు నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానికంగా నిర్మించిన  డబుల్‌ బెడ్రూం ఇళ్లను, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. మొదటగా నష్టపోయినవారికి, ఆ తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పక్కా ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్‌ ఆనందరావు, జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌, ఎంపీటీసీ మోహన్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ రాధిక, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.


కౌడిపల్లిలో స్థల పరిశీలన

కౌడిపల్లి, డిసెంబరు 19: మండల కేంద్రంలో త్వరలోనే 200 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే  మదన్‌ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బట్టెమ్మ గుడి సమీపంలో495 సర్వేనెంబర్‌లో ఇళ్ల నిర్మాణంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడతామని తెలిపారు. భూసర్వే చేసి వెంటనే తనకు నివేదికను అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ రాణా ప్రతా్‌పసింగ్‌, నాయకులు ఉన్నారు.


మైనార్టీల సంక్షేమానికి కృషి

నర్సాపూర్‌, డిసెంబరు 19: మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్‌ మండలంలోని నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  క్రిస్మస్‌  కేకును కట్‌ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ మాలతి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనుసూయా అశోక్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, నాయకులు, ఫాస్టర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-20T05:47:54+05:30 IST