డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T05:33:58+05:30 IST

డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశించారు.

డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
సిద్దిపేటలో ‘తపస్‌’ క్యాలెండర్‌ను అవిష్కరిస్తున్న ఎమ్మెల్యే


కాంట్రాక్టర్లను ఆదేశించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

దౌల్తాబాద్‌ డిసెంబరు 29, డబల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆదేశించారు. మంగళవారం దౌల్తాబాద్‌ ఎంపీపీ కార్యాలయంలో కాంట్రాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 3 నెలల్లోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వివిధ గ్రామాల ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం టీడీపీ  పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఇల్లెందుల రమేష్‌  ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా సత్కరించారు.  ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గంగాధరి సంధ్య,  ఎంిపీడీవో మచ్చెందర్‌, తహసీల్దార్‌ అరుణ, పీఆర్‌ ఏఈ శరత్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  


‘తపస్‌’ క్యాలెండర్‌ ఆవిష్కరణ

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా శాఖ  క్యాలెండర్‌ను ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జిల్లా విద్యాధికారి రవికాంతారావు మంగళవారం వేర్వేరుగా  ఆవిష్కరించారు.  ఆవిష్కరణలో జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బీరకాయల తిరుపతి,  రఘువర్ధన్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-12-30T05:33:58+05:30 IST