సంస్కృతాంధ్ర పండితుడు దోర్భల విశ్వనాథశర్మ మృతి
ABN , First Publish Date - 2020-12-06T05:50:24+05:30 IST
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సంస్కృతాంధ్ర భాషా పండితుడు, ప్రముఖ రచయిత దోర్భల విశ్వనాథశర్మ(90) కన్నుమూశారు.

రామాయంపేట, డిసెంబరు 5: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సంస్కృతాంధ్ర భాషా పండితుడు, ప్రముఖ రచయిత దోర్భల విశ్వనాథశర్మ(90) కన్నుమూశారు. సంస్కృతాంధ్ర భాషల్లో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన రచనల్లో ‘శ్రీలాలిక్యం’ విశిష్ట స్థానాన్ని పొందినది. ముఖ్యమంత్రి కేసీఆర్‌చే ఆయన విశిష్ట పురస్కారం అందుకున్నారు. అనేక పురస్కారాలు, అవార్డులు పొందిన విశ్వనాథశర్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్స పొందతున్నారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామమైన రామాయంపేటలో శనివారం నిర్వహించారు. విశ్వనాథశర్మ మృతిపై బ్రాహ్మణ సంఘం నాయకులు దోర్భల శ్రీనివాసశర్మ తదతరులు సంతాపం తెలిపారు.