బిలాల్‌పూర్‌లో జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2020-12-14T05:05:45+05:30 IST

మండలంలోని బిలాల్‌పూర్‌ గ్రామంలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాస్థాయి క్రిస్మస్‌ స్పెషల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు టోర్నమెంట్‌ నిర్వాహకుడు ఎం. అశోక్‌ తెలిపారు.

బిలాల్‌పూర్‌లో జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌

కోహీర్‌, డిసెంబరు 13: మండలంలోని బిలాల్‌పూర్‌ గ్రామంలో ఈ నెల 18, 19 తేదీల్లో జిల్లాస్థాయి క్రిస్మస్‌ స్పెషల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు  టోర్నమెంట్‌ నిర్వాహకుడు ఎం. అశోక్‌ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే ప్రథమ జట్టుకు రూ. 10వేలు, ద్వితీయ జట్టుకు రూ. 5వేలు, తృతీయ జట్టుకు రూ. 2,500 నగదు ఇవ్వనున్నట్టు వివరించారు. టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల 17వ తేదీలోగా తమ జట్టు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ టోర్నీలో వికారాబాద్‌ జిల్లాలోని మార్పల్లి, బంటారం, మొమిన్‌పేట్‌ మండలాల వారు పాల్గొనేందుకు అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు 91774 80635 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-12-14T05:05:45+05:30 IST