మార్చి లోగా ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-17T05:54:52+05:30 IST

మార్చి నెలాఖరులోగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు.

మార్చి లోగా ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీ
రాయపోల్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ఎమ్మెల్యే రఘునందన్‌రావు


రాయపోల్‌, డిసెంబరు 16: మార్చి నెలాఖరులోగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన రాయపోల్‌లో విలేకరులతో మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా మక్కలను రైతులు ఈనెల 25 లోగా మార్కెట్‌లో విక్రయించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండలాధ్యక్షుడు వెంకట్‌గౌడ్‌, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మంకిడి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు.


Updated Date - 2020-12-17T05:54:52+05:30 IST