మక్కల విక్రయంలో ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-11-21T06:06:54+05:30 IST

పంటలు సాగు చేసే సమయంలో రైతులు వ్యవసాయ అధికారులకు తెలిపి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రైతుబంధు రాదేమోనని కొందరు రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోలేదు. దీంతో మక్కల విక్రయంలో వారు ఇబ్బందులు పడుతున్నారు.

మక్కల విక్రయంలో ఇబ్బందులు

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికే టోకెన్లు

ఫ‘రైతుబంధు’ ఆశతో నమోదు చేసుకోని రైతులకు తిప్పలు


గుమ్మడిదల, నవంబరు 20: మొక్కజొన్న విక్రయంలో గుమ్మడిదల మండలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగు చేయొద్దని సూచించినా ఈ ప్రాంత రైతులు ఎక్కువగా సాగు చేశారు. పంటలు సాగు చేసే సమయంలో రైతులు వ్యవసాయ అధికారులకు తెలిపి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రైతుబంధు రాదేమోనని కొందరు రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోలేదు. దీంతో మక్కల విక్రయంలో వారు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని 15 రోజుల క్రితం గుమ్మడిదలలో ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. మిగిలిన వారికి టోకెన్లు ఇవ్వలేదు. గుమ్మడిదల మండలంలో కేవలం 1,300 ఎకరాల పంట మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదైంది. నమోదు కాని పంట దాదాపు వెయ్యి ఎకరాల్లో ఉన్నదని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లా అధికారులు, మార్కెఫెడ్‌ అధికారులు స్పందించి తమ పంటను కొనుగోలు చేయాలని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-21T06:06:54+05:30 IST