మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2020-12-21T05:15:01+05:30 IST
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది.

చేర్యాల, డిసెంబరు 20: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నకు గంగిరేగుచెట్టు ప్రాంగణంలో నజరు, బసచేసిన ప్రదేశంలో చెలక పట్నాలు రచించి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్నను దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, బండారి సమర్పించారు. గుట్టపైన వెలసిన ఎల్లమ్మ దేవతను దర్శించుకుని బోనం సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం ఆలయాలనికి సుమారు రూ.2లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.