ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం అవసరం

ABN , First Publish Date - 2020-03-15T12:06:46+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాభాగస్వామ్యం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం అవసరం

రాష్ట్ర సాంస్కృతిక ప్రభుత్వ సలహాదారు రమణాచారి

కొండపాక, మార్చి 14: గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాభాగస్వామ్యం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవీ రమణాచారి అన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శనివారం సందర్శించారు. ఇటీవల ఈ రెండు పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన పీఎన్‌ఆర్‌ సంస్థ అధినేత  పోల్కంపల్లి నరేందర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ బడుల్లోనే అందుతుందన్నారు. విద్య ద్వారానే విలువలు కలిగిన సమాజాన్ని, భావి భారతాన్ని తయారు చేయగలమని చెప్పారు.


అనంతరం విద్యార్థులకు ఇంగ్లిషు-తెలుగు నిఘంటువులను అందజేశారు. రాష్ట్రస్థాయి నాటకోత్సవంలో జానపద కళా ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులను అభినందించారు ప్రశంసాపత్రాలను అందజేశారు. పాఠశాలను సందర్శించిన రమణాచారి దంపతులను విద్యార్థులు, ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో  మాజీ ఉపవిద్యాధికారి వైకుంఠం, ఉపసర్పంచ్‌ బాలాగౌడ్‌, ఎంపీటీసీ భూములు గౌడ్‌, గీతకో ఆప్షన్‌ సభ్యుడు అజీముద్దీన్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-03-15T12:06:46+05:30 IST