గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-12-11T06:28:02+05:30 IST

సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గురువారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేశం లభించింది.

గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 10 : సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గురువారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేశం లభించింది. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల మేరకు..   పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని రుచి రెస్టారెంట్‌ ముందు గల ఫ్లాట్‌ఫారం కింది భాగంలో గుర్తు తెలియని సుమారు 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం ఉన్నట్టు రెడ్డి టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు ఉత్తమ్‌ వీఆర్వోకు సమాచారాన్ని అందించాడు.  వీఆర్వో జవాన్‌ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతి చెందిన వృద్ధుడు  రెండు మూడు నెలలుగా బిక్షాటన చేసేవాడని స్థానికులు తెలిపారన్నారు. మృతుడికి సంబంధించిన  ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.  మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచినట్టు ఎస్‌ఐ శ్రీకాంత్‌ వెల్లడించారు.  

Updated Date - 2020-12-11T06:28:02+05:30 IST