ఆటోను ఢీకొన్న డీసీఎం; డ్రైవర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2020-12-20T05:20:15+05:30 IST

డీసీఎం ఆటోను ఢీ కొట్టడంతో ఆటోడ్రైవర్‌కు గాయాలైన సంఘటనకంది మండలకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.

ఆటోను ఢీకొన్న డీసీఎం; డ్రైవర్‌కు గాయాలు
రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న కారు

కంది, డిసెంబరు 19 : డీసీఎం ఆటోను ఢీ కొట్టడంతో ఆటోడ్రైవర్‌కు గాయాలైన సంఘటనకంది మండలకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపునకు వెళ్తున్న ఆటోను కంది శివారులోని సంగమేశ్వర ఆలయం ఎదురుగా వెనుక వైపు నుంచి వస్తున్న ఓ డీసీఎం బలంగా ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆటో ముందు బాగం నుజ్జు నుజ్జయ్యంది. ఆటో నడుపుతున్న డ్రైవర్‌ సాయికృష్ణకు (22) గాయాలయ్యాయి. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.  


కారును ఢీ కొన్న లారీ: ఇద్దరికి గాయాలు

నారాయణఖేడ్‌, డిసెంబరు 19: కారును ఎదురుగా వస్తు న్న లారీ ఢీ కొనడంతో కారు లో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలైన సం ఘటన శనివారం సంగారెడ్డి - నాందేడ్‌ -అకోలా 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఇందుకు సంబంఽధించి ఖేడ్‌ ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండకు చెందిన దిలీప్‌(48), అతడి భార్యకమల(45) బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నారు. శనివారం కారులో సొంత గ్రామానికి బయలు దేరారు. నిజాంపేట దాటగానే ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొన్నది. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు బాగా దెబ్బతిందని, దిలీప్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2020-12-20T05:20:15+05:30 IST