పాడి రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు పొందాలి

ABN , First Publish Date - 2020-06-21T11:00:59+05:30 IST

పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేయనున్నట్లు పాడి పరిశ్రమ అభివృద్ధి, సహకార సమాఖ్య ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌

పాడి రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు పొందాలి

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 20: పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేయనున్నట్లు పాడి పరిశ్రమ అభివృద్ధి, సహకార సమాఖ్య ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యనారాయణ తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని విజయడెయిరీ కేంద్రంలో శనివారం ఆయన మెదక్‌, సంగారెడ్డి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెదక్‌ జిల్లాలో 3,200, సంగారెడ్డి జిల్లాలో 3,541 మంది లబ్ధిదారులకు వివిధ బ్యాంకుల ద్వారా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ పాడి రైతు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పొందాలని, ఇందుకోసం దరఖాస్తులను పాలసేకరణ కేంద్రం సూపర్‌వైజర్లకు అందజేయాలన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, క్రాప్‌లోన్‌ అకౌంటు జిరాక్స్‌ను దరఖాస్తుకు జత చేయాలన్నారు. సమావేశంలో మెదక్‌, సంగారెడ్డి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్‌, అధికారులు స్వామి, రంజిత్‌, నిఖిత, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-21T11:00:59+05:30 IST