రైతులకు ఆత్మహత్యలే శరణ్యం: చాడ వెంకటరెడ్డి

ABN , First Publish Date - 2020-11-19T20:05:35+05:30 IST

దేశం వ్యాప్తంగా రైతు బ్రతుకు చితికిపోతుందని.. రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయన్నారు.

రైతులకు ఆత్మహత్యలే శరణ్యం: చాడ వెంకటరెడ్డి

సిద్దిపేట: దేశం వ్యాప్తంగా రైతు బ్రతుకు చితికిపోతుందని.. రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయన్నారు. రైతులు వేసిన పంటకు మద్దతు ధర లేక అప్పుల పాలు అవుతున్నారని తెలిపారు. కేంద్రం రైతుల నడ్డి విరిచే విధంగా చట్టాలు తెస్తోందని విమర్శించారు. కార్పోరేట్ చేతుల్లోకి రైతులు వెళుతున్నారన్నారు. కేంద్రం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, బ్లాక్ మార్కెట్‌లను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత్రిత సాగుతో రైతుల్ని మోసం చేశాడని చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని,  రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిధాన్యానికి వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు. ఆందోళనలో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T20:05:35+05:30 IST