దుబాయ్‌ నుంచి వచ్చి.. తెలంగాణలో ఇరుక్కుపోయి

ABN , First Publish Date - 2020-03-23T07:02:25+05:30 IST

డివిజన్‌లో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం నుంచే పోలీసులు రోడ్లపైకి వచ్చి రోడ్లపై తిరుగుతున్న వారిని సముదాయించి బంద్‌కు...

దుబాయ్‌ నుంచి వచ్చి.. తెలంగాణలో ఇరుక్కుపోయి

  • వైద్య పరీక్షలు చేసిన సిబ్బంది
  • ఆ 39 మందిని సంగారెడ్డలోని గచ్చిబౌలి క్వారంటైన్‌కు తరలించనున్న పోలీసులు


జహీరాబాద్‌, మార్చి 22: డివిజన్‌లో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం నుంచే పోలీసులు రోడ్లపైకి వచ్చి రోడ్లపై తిరుగుతున్న వారిని సముదాయించి బంద్‌కు సహకరించాలని సూచించారు. చిరాగ్‌పల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దు వద్ద డీఎస్పీ గణపతిజాదవ్‌ నేతృత్వంలో పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో తనఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు  చేశారు. ఉదయం నుంచే కర్ణాటక సరిహద్దు వద్ద పోలీసులు ముమ్మర తనఖీలు చేపట్టి ఎక్కడ వాహనాలను అక్కడే నిలిపివేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనతా కర్ఫ్యూను గమనించన కొందరు రాష్ట్ర సరిహద్దులో ఇరుక్కుపోయారు. ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు జహీరాబాద్‌ సరిహద్దులో ఆదివారం ఉదయం ఇరుక్కు పోయారు. విజయవాడ, పరిసర గ్రామాలకు చెందిన 39మంది బతుకు దెరువు కోసం గత అక్టోబర్‌-నవంబర్‌లో దుబాయ్‌లోని ఖతర్‌, ఒమన్‌ ప్రాంతాలకు వెళ్లారు. 20న దుబాయ్‌ నుంచి ముంబాయికి తిరిగి వచ్చారు. ముంబాయి ఎయిర్‌పోర్టులో ఆర్టీఏ, పోలీసు అధికారులు తనఖీలు చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ప్రయాణికలుఉ తెలిపారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు, ఆర్టీవో కార్యాలయ అధికారులు విజయవాడ వెళ్లండంటూ అనుమతులు ఇచ్చి టూరిస్టు బస్సులో పంపించారని వారు చెప్పారు. 21న సాయంత్రం హైదరాబాద్‌కు వస్తుండగా  కర్ణాటక సరిహద్దు వద్ద చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలో వారిని పోలీసులు నిలిపేశారు.  మహరాష్ట్ర అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన 39మందికి 15రోజుల పాటు హోమ్‌ కార్వరంటైన్‌లో ఉండాలని సూచించినట్లు వారు పోలీసులకు వివరించారు. వదిలేయండని ప్రాథేయపడినా ప్రభుత్వఆదేశాల మేరకు తామేమి చేయలేమని కర్ణాటక, మహారాష్ట్రస్పష్టం చేసినట్లు వారు వాపోయారు. సోమవారం ఉదయం 6గంటలకు ఆ 39 మందిని సంగారెడ్డిలోని గచ్చిబౌలి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో 34 మంది దుబాయ్‌లోని ఖతర్‌ నుంచి రాగా మరో ఐదుగురు ఒమన్‌ ప్రాంతం నుంచి వచ్చినట్లు చెప్పారు. వారికి సరిహద్దులో జహీరాబాద్‌ వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Updated Date - 2020-03-23T07:02:25+05:30 IST