ఉమ్మడి జిల్లాలో 490 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-09-01T07:06:11+05:30 IST

ఉమ్మడి జిల్లాలో సోమవారం 490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు.

ఉమ్మడి జిల్లాలో 490 మందికి కరోనా పాజిటివ్‌

సిద్దిపేట, ఆగస్టు 31 : ఉమ్మడి జిల్లాలో సోమవారం 490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. సిద్దిపేటలోని నవగ్రహాల గుడి సమీపంలో ఒకే ఇంట్లో 15 మందికి పాజిటివ్‌గా తేలింది. సిద్దిపేట డివిజన్‌లో 249 కేసులు, గజ్వేల్‌ డివిజన్‌లో 89, హుస్నాబాద్‌ డివిజన్‌లో 49 కేసుల చొప్పున నమోదయ్యాయి. సిద్దిపేటలో గొంతుస్రావాల ద్వారా 49, చేర్యాల సీహెచ్‌సీలో 12, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరు 8, ఇబ్రహీంనగర్‌ 17, దౌల్తాబాద్‌ 3, ఇందుప్రియాల్‌ 1, దుబ్బాక సీహెచ్‌సీలో 9, పీహెచ్‌సీల వారీగా రామక్కపేట 4, తిమ్మాపూర్‌ 7, కొమురవెల్లి 6, మిరుదొడ్డి 4, భూంపల్లి 25, రాజగోపాల్‌పేట 11, నంగునూరు 10, నారాయణరావుపేట 12, పుల్లూరు 18, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 11, అంబేడ్కర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 13, తొగుటలో 29 కేసులు నమోదయ్యాయి.


గజ్వేల్‌ డివిజన్‌లో గజ్వేల్‌ ఆస్పత్రిలో 16, పీహెచ్‌సీల వారీగా అహ్మదీపూర్‌ 11, సిరిగిరిపల్లి 12, జగదేవ్‌పూర్‌ 7, తిగుల్‌ 1, కొండపాక 9, కుకునూరుపల్లి 11, మర్కుక్‌ 4, ములుగు 5, సింగన్నగూడెం 4, రాయపోల్‌ 5, వర్గల్‌ 4 కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్‌లో పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేట 8, బెజ్జంకి 3, తోటపల్లి 2, హుస్నాబాద్‌ 13, కోహెడ 12, లద్నూర్‌ 2, మద్దూరు 9 కేసులు వచ్చాయి.


మెదక్‌ జిల్లాలో 

మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 31 : మెదక్‌ జిల్లావ్యాప్తంగా సోమవారం 48 మందికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యశాఖ ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని జమ్మికుంటకు చెందిన వ్యక్తి (50), నవాబుపేట వీధికి చెందిన వృద్ధుడు (70) కరోనాతో మృతిచెందారు. మండలాల వారీగా పరిశీలిస్తే అల్లాదుర్గం 10, మెదక్‌ టౌన్‌ 8, కౌడిపల్లి 4, నిజాంపేట 4, చేగుంట 3, కొల్చారం 3, రేగోడ్‌ 3, నర్సాపూర్‌ 2, నార్సింగి 2, తూప్రాన్‌ 2, పాపన్నపేట 2, శంకరంపేట 2, చిల్‌పచెడ్‌, టేక్మాల్‌, శివ్వంపేట మండలాలలో ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


సంగారెడ్డి జిల్లాలో 

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 31 : జిల్లాలో 55 మందికి పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. నారాయణఖేడ్‌ 18, సంగారెడ్డి 6, ఇస్నాపూర్‌ 5, ఎల్గోయ్‌ 5, కాశీపూర్‌ 4, కుప్పానగర్‌ 3, బేగంపేట 2, పటాన్‌చెరు 2, పోసానిపేట 2, జోగిపేట, మంతారం, కిష్టారెడ్డిపేట, ఈదులపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కానుకుంట, చౌటకూర్‌, వడ్డేనగడ్డతండాలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.


Updated Date - 2020-09-01T07:06:11+05:30 IST