సిద్దిపేట జిల్లాలో 264 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-20T09:02:08+05:30 IST
జిల్లాలో శనివారం 264 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

మిరుదొడ్డి మండలంలో ఒకరి మృతి
సిద్దిపేట, సెప్టెంబరు 19: జిల్లాలో శనివారం 264 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట డివిజన్లో 154 కేసులు, గజ్వేల్ డివిజన్లో 52, హుస్నాబాద్ డివిజన్లో 58 కేసుల చొప్పున నమోదయ్యాయి. మిరుదొడ్డి మండలంలో ఒకరు మృతి చెందారు. సిద్దిపేట డివిజన్లో... సిద్దిపేటలో గొంతుస్రావాల ద్వారా 52, చేర్యాల సీహెచ్‌సీలో 17, పీహెచ్‌సీల వారీగా చిన్నకోడూరులో 3, ఇబ్రహీంనగర్‌లో 5, దౌల్తాబాద్‌లో 3, దుబ్బాక సీహెచ్‌సీలో 2, పీహెచ్‌సీల వారీగా.. రామక్కపేటలో 3, తిమ్మాపూర్‌లో 3, కొమురవెల్లిలో 2, మిరుదొడ్డిలో 2, భూంపల్లిలో 20, రాజగోపాల్‌పేటలో 3, నంగునూరులో 2, నారాయణరావుపేటలో 3, పుల్లూరులో 16, సిద్దిపేటలోని నాసర్‌పుర యూపీహెచ్‌సీలో 11, అంబేడ్కర్‌నగర్ యూపీహెచ్‌సీలో 14, తొగుటలో 11 కేసులు నమోదయ్యాయి. గజ్వేల్ డివిజన్లో... పీహెచ్‌సీల వారీగా అహ్మదీపూర్, సిరిగిరిపల్లిలో 20, జగదేవ్‌పూర్‌లో 2, తిగుల్‌లో 4, కొండపాకలో 4, కుకునూరుపల్లిలో 9, మర్కుక్‌లో 2, ములుగులో 4, సింగన్నగూడెంలో 1, రాయపోల్‌లో 3, వర్గల్లో 3 కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ డివిజన్లో.. పీహెచ్‌సీల వారీగా అక్కన్నపేటలో 4, బెజ్జంకిలో 12, తోటపల్లిలో 8, హుస్నాబాద్‌లో 20, కోహెడలో 7, లద్నూర్‌లో 1, మద్దూరులో 6 కేసులు వెలుగుచూశాయి.
మెదక్ జిల్లాలో మూడు వేల మార్కు దాటిన కరోనా కేసులు
తాజాగా 54 మందికి పాజిటివ్
మెదక్ అర్బన్, సెప్టెంబరు 19: మెదక్ జిల్లాలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నెలలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేల మార్కు దాటింది. శనివారం తాజాగా జిల్లాలో 54 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 3,045కు చేరుకుంది. మండలాలవారిగా మెదక్ టౌన్ 17, నిజాంపేట్ 15, రామాయంపేట 12, తూప్రాన్ 2, వెల్దుర్తి 2, చేగుంట, మనోహరాబాద్, నార్సింగ్, పాపన్నపేట్, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో 59 మందికి కరోనా పాజిటివ్
సంగారెడ్డి అర్బన్, సెప్టెంబరు 19 : జిల్లాలో శనివారం 59 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డి-4, అమీన్పూర్-6, సదాశివపేట-6, జోగిపేట-1, పటాన్చెరు-2, ఆర్సీపురం-2, వట్పల్లి మండలం లక్యానాయక్తండా-2, న్యాల్కల్ మండలం హద్నూర్-2, పటాన్చెరు మండలం ఇస్నాపూర్-4, చిట్కుల్-1, భానూర్-2, నందిగామ-1, సుల్తాన్పూర్-1, రుద్రారం-1, నాగాపూర్-2, సదాశివనగర్-1, మామిడిపల్లి-1, చెర్యాల్-1, జుల్కల్-1, కంది-2, బొంతపల్లి-2, అన్నారం-4, దిగ్వాల్-4, లింగంపల్లి-2, చందాపూర్-1, పెద్దమ్మగూడెం-1, మల్చెల్మ-1, నమిలిమెట్లో ఒకరికి కరోనా వచ్చిందన్నారు. పాజిటివ్ వచ్చిన 59 మందిలో 57 మంది హోంఐసోలేషన్లో ఉండగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 1,622 మందికి ర్యాపిడ్ టెస్టులు చేశామన్నారు. కంది జిల్లా జైలు వద్ద ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాన్ ద్వారా 100 మంది శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కి పంపామన్నారు. ఇలా ఉండగా సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి నుంచి 125 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్ నిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి పంపామన్నారు. ఆర్సీపురం బీహెచ్ఈఎల్లో ఓ వ్యక్తి (79) కరోనాతో మృతిచెందినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మోజీరాంరాథోడ్ వివరించారు.