జిల్లాలో 26 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-24T11:48:09+05:30 IST
జిల్లాలో శుక్రవారం 26 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు

సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 23 : జిల్లాలో శుక్రవారం 26 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డిలో-2, జోగిపేట-1, బొల్లారం-1, అమీన్పూర్-3, పటాన్చెరు-1, ఆర్సీపురం-2, బొంతపల్లి-2, ఇస్నాపూర్-4, కంది-6, జుల్కల్-2, గుంతపల్లి, మల్లేపల్లిలలో ఒక్కొక్కరికి కరోనా వచ్చిందన్నారు. పాజిటివ్ వచ్చిన 26 మంది హోంఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 641 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశామన్నారు. జిల్లా ఆస్పత్రి నుంచి 41 మంది, పటాన్చెరు నుంచి 64 మంది శాంపిళ్లు సేకరించి కొవిడ్ నిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి పంపామని ఆయన పేర్కొన్నారు.