సంగారెడ్డి జిల్లాలో 58 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-14T18:16:26+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో సోమవారం 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-16, మండల పరిఽధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట-1 సదాశివపేట-4,

సంగారెడ్డి జిల్లాలో 58 మందికి పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌ (ఆంధ్రజ్యోతి):  సంగారెడ్డి జిల్లాలో సోమవారం 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-16, మండల పరిఽధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట-1 సదాశివపేట-4, మండల పరిధిలోని ఆరూర్‌-1, అనంతసాగర్‌-1, గుమ్మడిదల మండలం దోమడుగు-1, బీరంగూడ-3, ఆర్సీపురం-5, అమీన్‌పూర్‌-3, పటాన్‌చెరు-3, ముత్తంగి-1, కోహీర్‌-1, కంది మండలం కలివేముల-1, ఇంద్రకరణ్‌-1, జుల్‌కల్‌-1, ఓడీఎఫ్‌-1, జహీరాబాద్‌-11, నల్లవాగు-1, మునిపల్లి మండలం బోడపల్లి-1, కొండాపూర్‌-1 కరోనా సోకిందని వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలో నమోదైన 16 కేసుల్లో భవానీనగర్‌-2, వీరభద్రనగర్‌ సితార థియేటర్‌-1, రాంనగర్‌-2, ఆర్టీసీ కాలనీ-1, బ్యాంక్‌కాలనీ-1, మంజీరనగర్‌-3, గణేశ్‌నగర్‌-3, హాస్టల్‌గడ్డ-1, జలాల్‌బాగ్‌-1, పోతిరెడ్డిపల్లి-1 నిర్ధారణ అయింని చెప్పారు. జిల్లా ఆస్పత్రి కరోనా వార్డులో 21 మంది పాజిటివ్‌ బాధితులు, పది మంది కరోనా అనుమానిత లక్షణాలున్న  వారు ఉన్నారని తెలిపారు. జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ నుంచి 80 మంది, జహీరాబాద్‌ నుంచి 84 మంది శాంపిళ్లను సేకరించి కోవిడ్‌ నిర్ధారణ కోసం గాంధీకి పంపామని డీఎంహెచ్‌వో తెలిపారు. 


డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బందినీ వదలని కరోనా

వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కలకలం రేపుతోంది. ఉద్యోగులు, డాక్లర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా విజృంభిస్తున్నది. ఈ నెల 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 22 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అందులో సగానికి పైగా కోలుకున్నారు. జిల్లా వైధ్యాధికారి కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఓ డాక్టర్‌, ఉద్యోగి, ఇద్దరు ఏఎన్‌ఎంలకు కరోనా సోకి కోలుకున్నారు. తాజాగా ఓ డాక్టర్‌, ఓ వార్డు బాయ్‌కి కరోనా సోకింది. జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో తాజాగా నలుగురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు ఆయాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే 15 రోజులు క్రితం వైద్యారోగ్యశాఖలోని ఓ ప్రోగ్రామ్‌లో పనిచేసే డాక్టర్‌, నర్సు, వారం రోజుల క్రితం ఝరాసంఘం, కల్హేర్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్లు కరోనా బారిన పడగా వారు కోలుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా కరోనా బారిన పడుతుండటంతో మిగతా డాక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 


రేపటి నుంచి అందుబాటులోకి 100 పడకలు

సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో 50 పడకల ఐసోలేషన్‌ వార్డుకి అదనంగా 100 పడకలతో సంగారెడ్డి మండలం ఫసల్‌వాది శివారులోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలో కరోనా వార్డును ఏర్పాటు చేస్తున్నారు. అందులో 90 పడకల ఐసోలేషన్‌ వార్డు, 10 పడకలతో ఐసీయూను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 15 వ తేదీ నుంచి ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో కరోనా సేవలు అందుబాటులోకి రానున్నాయని డీఎంహెచ్‌వో తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని జహీరాబాద్‌, పటన్‌చెరు ఏరియా ఆస్పత్రుల్లో 20 పడకల చొప్పున ఐసోలేషన్‌, జోగిపేట నారాయణఖేడ్‌ ఏరియా ఆస్పత్రుల్లో 10 పడకల చొప్పున ఐసోలేషన్‌ వార్డులు ఉండగా, అదనంగా మరో వంద పడకలతో ఐసోలేషన్‌ వార్డును ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో సిద్ధం చేస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాథోడ్‌ కోరారు.

Updated Date - 2020-07-14T18:16:26+05:30 IST