జిల్లాలో 3,599కు చేరిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-07T06:52:54+05:30 IST
జిల్లాలో కొవిడ్-19 వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,599కు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో

మెదక్ అర్బన్, అక్టోబరు 6: జిల్లాలో కొవిడ్-19 వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,599కు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో కొత్తగా 32 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మెదక్ టౌన్ 8, తూప్రాన్ 4, చిన్నశంకరంపేట 3, రేగోడు 3, శివ్వంపేట 3, పాపన్నపేట 2, చేగుంట 2, నార్సింగి 2, అల్లాదుర్గం, మనోహరాబాద్, చిల్‌పచెడ్, కౌడిపల్లి, నిజాంపేట మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆర్యోగ శాఖ ప్రకటించింది.