రెండ్రోజుల క్రితం కరోనాతో ఓ వ్యక్తి మృతి.. అతడి ద్వారా ఎంతమందికి పాజిటివ్ వచ్చిందంటే..

ABN , First Publish Date - 2020-07-20T18:53:40+05:30 IST

జిల్లాలో ఆదివారం 57 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డిలో 21, సదాశివపేట-7, జహీరాబాద్‌-5, హోతి(బి), తెల్లాపూర్‌, పటాన్‌చెరు, అదే మండలంలోని ఇస్నాపూర్‌,

రెండ్రోజుల క్రితం కరోనాతో ఓ వ్యక్తి మృతి.. అతడి ద్వారా ఎంతమందికి పాజిటివ్ వచ్చిందంటే..

సంగారెడ్డి జిల్లాలో 57 మందికి పాజిటివ్‌

పెద్దాస్పత్రిలో ముగ్గురు నర్సులు, ఓ స్టూడెంట్‌, పేషెంట్‌ కేర్‌ టేకర్‌కు కరోనా

పోతిరెడ్డిపల్లిలో ఒకే కుటుంబంలో ఐదుగురికి


సంగారెడ్డి అర్బన్‌ : జిల్లాలో ఆదివారం 57 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డిలో 21, సదాశివపేట-7, జహీరాబాద్‌-5, హోతి(బి), తెల్లాపూర్‌, పటాన్‌చెరు, అదే మండలంలోని ఇస్నాపూర్‌, కంది మండలం ఇంద్రకరణ్‌, చిద్రుప్ప, హత్నూర మండలం గుండ్లమాచునూర్‌, కొండాపూర్‌ మండలం మారెపల్లి, ఓడీఎఫ్‌, గుమ్మడిదల మండలం అన్నారం, బొంతపల్లి, అమీన్‌పూర్‌లలో ఒక్కొక్కరికి కరోనా సోకిందని డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ పేర్కొన్నారు. కోహీర్‌ మండలం పిచేరాగడి లో ఏడుగురికి, నారాయణఖేడ్‌లో ఇద్దరికి, జోగిపేటలో ఇద్దరికి, వట్‌పల్లిలో ఒకరికి పాజిటివ్‌గా తేలినట్లు ఆయా ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డిలో నమోదైన 21 కేసుల్లో పోతిరెడ్డిపల్లిలోని ఒకే కుటుంబంలో ఐదుగురికి సోకగా, హాస్టల్‌గడ్డలో-4, ఆర్టీసీ కాలనీ-3, విద్యానగర్‌, ఓడీఎఫ్‌ కాలనీ, రాజంపేట, పీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలోని శ్రీఅపార్ట్‌మెంట్‌, మంజీరానగర్‌, శాంతినగర్‌, శ్రీనగర్‌, సాయినగర్‌, ప్రశాంత్‌నగర్‌లలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లా ఆస్పత్రిలో ముగ్గురుస్టాఫ్‌ నర్సులు, ఓ శిక్షణ స్టూడెంట్‌, పేషెంట్‌ కేర్‌ టేకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధా రణ అయినదని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా ఆస్పత్రి కరోనా వార్డులో ఇద్దరు పాజిటివ్‌ బాధితులు, మరో ఇద్దరు లక్షణాలున్న వారున్నారని తెలిపారు. కరోనా లక్షణాలతో జిల్లా ఆస్పత్రిలోని కరోనా వార్డుకు వచ్చిన ఓ వ్యక్తికి(60) ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టుచేయగా పాజిటివ్‌గా తేలిందని, అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని వైద్యాధికారులు తెలిపారు.   


కోహీర్‌ మండలంలోని పిచేరాగడి గ్రామంలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు దిగ్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాజ్‌కుమార్‌ తెలిపారు. పిచేరాగడి గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వ్యక్తికి కరోనా సోకి రెండు రోజుల క్రితం మృతి చెందాడు. ఫ్రైమరీ కాంటాక్ట్‌ కింద 8 మంది కుటుంబ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ తెలిపారు. వారిని సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్టు తెలిపారు.


నారాయణఖేడ్‌లో ఆదివారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని ఏఎస్‌ నగర్‌లో నివాసం ఉంటున్న దంపతులకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు నిజాంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజేశ్వర్‌ తెలిపారు. భార్య, భర్తకు కరోనా పాజిటివ్‌ ఏ విధంగా వచ్చిందని అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. దంపతులను హోం క్వారెంటైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 


వట్‌పల్లిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తాలెల్మ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధి కారిణి డాక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. వట్‌పల్లి గ్రామంలోని ఓ మహిళ(32) అనారోగ్యానికి గురికావటంతో ఈనెల 17న సంగా రెడ్డిలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేపించుకున్నట్లు తెలిపారు. ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా వట్‌పల్లికి చెందిన యువకుడికి (35) పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆయన వివరాలు తెలియాల్సి ఉందని వైద్యాధికారిణి తెలిపారు.


మళ్లీ జిల్లా బులెటిన్‌ బంద్‌

కరోనా కేసుల వెల్లడి విషయంలో వైద్య ఆరోగ్య శాఖ తీరు మారడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మొదటిసారిగా ఈ నెల 14న జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా పాజిటివ్‌ లెక్కల వివరాలను వెల్లడించింది. మార్చిలో కరోనా వ్యాప్తి ప్రారం భమైతే మూడు నెలల తర్వాత ఇటీవలే ఒకటి, రెండు రోజులు బులెటిన్‌ను విడుదల చేసింది. రెండు రోజుల నుంచి మళ్లీ నిలిపివేశారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోలకు రాష్ట్రస్థాయి అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమా చారం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్‌ బులెటిన్‌కి జిల్లాల్లో డీఎంహెచ్‌వోలు విడుదల చేస్తున్న దానికి లెక్కల్లో తేడా ఉంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 

Updated Date - 2020-07-20T18:53:40+05:30 IST