కూరగాయల పంపిణీతో కరోనా రావొచ్చు

ABN , First Publish Date - 2020-05-09T09:58:17+05:30 IST

కొందరు కేవలం ప్రచారం కోసమే కూరగాయలను పంచిపెట్టడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, అలా కాకుండా పేదవారికి బియ్యం

కూరగాయల పంపిణీతో కరోనా రావొచ్చు

వాటికి బదులు బియ్యం పంచండి : ఎమ్మెల్యే రామలింగారెడ్డి


తొగుట, మే 8:  కొందరు కేవలం ప్రచారం కోసమే కూరగాయలను పంచిపెట్టడం వల్ల ప్రమాదం పొంచి ఉందని, అలా కాకుండా పేదవారికి బియ్యం పంపిణీ చేస్తే ఒక పూటనైనా తింటారని అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్‌ యార్డు ఆవరణంలో దాతల సహకారంతో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కూరగాయలను ఎక్కడి నుంచో తీసుకురావడం వల్ల అనేక చేతులు మారతాయని, దీంతో కరోనా వచ్చే ప్రమాదముందని సూచించారు.


అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల తనిఖీల తర్వాతే వారి పర్యవేక్షణలోనే సరుకులు గాని, కూరగాయల పంపిణీకి గానీ అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. పేదలను ఆదుకునేందుకు నరసింహారెడ్డి ముందుకు రావడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ లత, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌ రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ హరికృష్ణ రెడ్డి, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్‌ కొండల్‌ రెడ్డి, ఎంపీటీసీ లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T09:58:17+05:30 IST