సోడాకు కరోనా దెబ్బ!

ABN , First Publish Date - 2020-04-08T10:40:04+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణలో చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో మెదక్‌ జిల్లా స్థంభించిపోయింది. ఇక రోజువారీ కూలీలు

సోడాకు కరోనా దెబ్బ!

మెదక్‌:  కరోనా వైరస్‌ నియంత్రణలో చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో మెదక్‌ జిల్లా స్థంభించిపోయింది. ఇక రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతి ఏడాది వేసవిలో మెదక్‌ జిల్లాలో వందలాది మంది చిరువ్యాపారులు నిమ్మకాయ సోడాలు విక్రయించేవారు. ఈ సీజన్‌లో ఆరంభంలో నుంచే లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ఇంకా బోణీ కాలేదని, లాక్‌డౌన్‌తో వీధుల్లో జనసంచారం లేక  నిర్మానుష్యంగా మారడంతో సోడా తాగేవారే కరువయ్యారు. మెదక్‌ పట్టణంలో ఓ వ్యాపారి తన ఆవేదన వెలిబుచ్చాడు.  

Updated Date - 2020-04-08T10:40:04+05:30 IST