బ్రిటన్‌ నుంచి హుస్నాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-12-26T05:23:14+05:30 IST

బ్రిటన్‌ నుంచి హుస్నాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్‌

బ్రిటన్‌ నుంచి హుస్నాబాద్‌కు వచ్చిన మహిళకు పాజిటివ్‌

సిద్దిపేట: జిల్లాలో శుక్రవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేటలో  8,  మిరుదొడ్డిలో 1,  గజ్వేల్‌ ఆస్పత్రి లో 1, అక్కన్నపేటలో 1, బెజ్జంకిలో 3, కోహెడలో 1 కేసు వెలుగుచూసింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళ హుస్నాబాద్‌కు వచ్చిందని తెలియడంతో ఆమె కుటుంబంలోని ఐదుగురికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు విమానాశ్రయంలో పరీక్ష చేసినపుడు నెగటివ్‌గా తేలింది. గురువారం సిద్దిపేటలో మరోసారి మహిళను పరీక్షించగా పాజిటివ్‌ రాగా ఆమె కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


Updated Date - 2020-12-26T05:23:14+05:30 IST