సెప్టెంబరు 15 వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తి
ABN , First Publish Date - 2020-08-12T11:02:04+05:30 IST
రైతువేదికలతో సాగు దిశ మారుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

పాపన్నపేట, ఆగస్టు 11: రైతువేదికలతో సాగు దిశ మారుతుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పాపన్నపేటలో పలు రోడ్ల నిర్మాణానికి సోమవారం ఆయన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఘణపూర్, పాపన్నపేటలో రూ.10 కోట్లతో బీటీ రోడ్లు, పాపన్నపేటలో రూర్బన్ కింద రూ.55 లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని వెల్లడించారు. పాపన్నపేటలో సర్పంచ్ గురుమూర్తిగౌడ్ కోరిక మేరకు అదనంగా నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతును రాజును చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు.
సెప్టెంబరు 15 వరకు రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలో 469 పంచాయతీల్లో డంపుయార్డులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, జడ్పీటీసీ షర్మిళారెడ్డి, మండల సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, ఉపసర్పంచ్ బాల్‌రాజ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచులు జగన్, వెంకటరాములు, నవీన్, లింగారెడ్డి, మల్లేశం, బాపురెడ్డి, దాసు, ఎంపీటీసీ రాములు, నాయకులు గోపాల్‌రెడ్డి, మల్లన్న, కిషన్‌రెడ్డి, సుభా్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.