ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-29T05:19:00+05:30 IST
సిద్దిపేట సిటీ, డిసెంబరు 28: 136 ఏళ్ల నుంచి కాంగ్రెస్ బడుగు, బలహీనవర్గాల పేదలకు రైతులకు నిరుద్యోగులకు మహిళలకు సేవలందిస్తూ ప్రజాసేవ పార్టీగా పేరుగాంచిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు.

సిద్దిపేట సిటీ, డిసెంబరు 28: 136 ఏళ్ల నుంచి కాంగ్రెస్ బడుగు, బలహీనవర్గాల పేదలకు రైతులకు నిరుద్యోగులకు మహిళలకు సేవలందిస్తూ ప్రజాసేవ పార్టీగా పేరుగాంచిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేటలోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, దరిపల్లిచంద్రం, ప్రభాకర్ వర్మ, జీవన్ రెడ్డి, బొమ్మల యాదగిరి, గిరి కొండల్‌రెడ్డి, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి
హుస్నాబాద్ : పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్‌లోని అక్కన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కోమటి సత్యనారయణ, చిత్తారి రవీందర్, ఎండీ హసన్, పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, వల్లపు రాజు, పున్న లావణ్య, మ్యాదరబోయిన శ్రీనివాస్, మడప యాదవరెడ్డి, బొంగొని శ్రీనివా్‌స,వెన్న రాజు, బంకు చందు, సది, తదితరులు పాల్గొన్నారు.
ఆయా మండలాల్లో..
చిన్నకోడూరు : మండలంలోని రామునిపట్లలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ జెండాను ఎగురవేశారు.. కార్యక్రమంలో నాయకులు జంగిటిశ్రీనివాస్, కోండం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల శ్రీనివాస్, కనకరాజు, మల్లేష్, చిరంజీవి పాల్గొన్నారు.
బెజ్జంకి : దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివా్‌సరెడ్డి , నర్సయ్య, లక్ష్మణ్, పరుశరాములు, రాజు, శ్రీకాంత్, శ్రవణ్, వాజిద్, కనకయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
తొగుట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. తొగుటలో ఆయన పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో తొగుట ఉపసర్పంచ్ పేర్ల బాలరాజు, పార్టీ సీనియర్ నాయకులు నరేందర్‌రెడ్డి, విజయ్ రెడ్డి, శ్రీనకర్ రెడ్డి, కొంగరి నర్సింలు, వార్డు సభ్యులు భాస్కర్, సుధాకర్ రెడ్డి, తిరుపతి, అఖిల్ గౌడ్, బాల్ రెడ్డి, స్వామి, నరేష్ పాల్గొన్నారు.
మద్దూరు : మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాల్లో కాంగ్రెస్ 136వ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఆపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు బండి శ్రీనివాస్ జెండా ను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్కూరి కమలాకర్ యాదవ్, ఎంపీటీసీలు బొప్పె కనకమ్మనాగయ్య, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.