ఇంట్లోనే కలెక్టర్ వెంకట్రామారెడ్డి
ABN , First Publish Date - 2020-03-23T06:52:54+05:30 IST
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలోనే గడిపారు. టీవీ వార్తలు చూస్తూ, ఎప్పటికప్పుడు...

సిద్దిపేట, మార్చి 22 : జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలోనే గడిపారు. టీవీ వార్తలు చూస్తూ, ఎప్పటికప్పుడు జిల్లా పరిస్థితిని తెలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితరులతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో కరోనాను ఎదుర్కోవడంలో సహకరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.